ముంపు గ్రామాల ఆందోళన
ముంపు గ్రామాల ఆందోళన
అచ్చంపేట మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద SLBC కెనాల్ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. ప్రాజెక్ట్ పనులలో భాగంగా తమ వ్యవసాయ పొలాలు ఇళ్లు కోల్పోయామని,కేవలం ఇళ్లకు మాత్రమే నష్టపరిహారం చెలించారని,పొలాలకు సంబంధించిన ఎలాంటి పరిహారం తమకు అందలేదని తెలియజేశారు.
మన్నేవారిపల్లి,దాని పరిసర ప్రాంతాల్లోని మొత్తం 5200 కుటుంబాలకు గాను 2000 కుటుంబాలు ముంపుకు గురి అవుతున్నాయి. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండడంతో తమ పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని లేదా ముంపు భాదితులకు కుటుంబములో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం ఆందోళనకారులు తహసిల్దార్ కార్యాలయం చేరుకోగా,తహసిల్దార్ గారు మండల ప్రజా పరిషత్ లో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఉండడంతో మధ్యాహ్నం దాకా ఎదురుచూసి,ఆయన వచ్చిన తర్వాత కలసి చర్చించారు, ఆయన ముంపు గ్రామాల బాధితులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని,వారికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.