మాధవానిపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం వేడుకలు
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మాధవానిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ ఆహార దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోనేరు సంస్థ డైరెక్టర్ ఎం.ఎ.సలీం పాల్గొని మాట్లాడుతూ…చిరుధాన్యాల ప్రాధాన్యత, సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు,ఆకుకూరలకే ఎక్కువ విలువ ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మన్నెమ్మ మాట్లాడుతూ…ఈ వారోత్సవాలను ఐసిడిఎస్ తో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామ గ్రామాన నిర్వహిస్తూ అటు పిల్లలు, తల్లులు, ప్రజా సమూహాలకు చైతన్య పరుస్తున్నామన్నారు. హెల్త్ సూపర్వైజర్ మాధవాచారి మాట్లాడుతూ… రక్తశాతం పెరగాలంటే సరైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్యపరమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ సత్యనారాయణ, కోనేరు,ఎంవీఎఫ్ సంస్థల సమన్వయకర్త ఎండి ఇస్మాయిల్, వెంకటేష్,బాలల సంక్షేమ కమిటీ సభ్యులు లింగమయ్య, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.