మహాత్మా గాంధీ
బాపూజీ అని ఆప్యాయతతో పిలుచుకునే గాంధీగారు పుత్తాలిభాయి, కరమ్ చాంద్ గాంధీ దంపతులకు అక్టోబర్ – 2 – 1869 పోరుబందరు పట్టణం లో జన్మించారు. గాంధీజీ ని భారత జాతిపిత అని పిలుస్తాము. అయన ప్రాధమిక విద్య తరువాత న్యాయశాస్త్రం చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారు తన పదమూడో ఏటనే గాంధీజీ కి కస్తూరిభాయి తో వివాహం జరిగింది.
చిన్నతనం నుంచి దైవభక్తి , సత్యసంధత, నిర్భయత అలవడింది గాంధీజీ భగవత్ గీత తో పటు సకల మాత గ్రంధాలను చదివి సర్వ మత సామరస్యం ముఖ్యమని గ్రహించారు.
దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఆహ్వానాన్ని అందుకొని దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు అక్కడ శ్వేతజాతీయుల దురహంకారాన్ని జాతివివక్షతను , హీనస్థితిగతులను తెలుసుకొని వాటికీ వ్యతిరేకంగా 1893 లో శాంతిని, అహింసను ఆయుధాలుగా చేపట్టి వీరోచిత పోరాటం సాగించారు అపరబుధుడిగా సత్యాగ్రహం చేపట్టి ప్రభుత్వాన్ని గడగడా లాడించాడు .
1915 లో తిరిగి భారత దేశానికి వచ్చి స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి కాంగ్రెస్ నాయకత్వం లో ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపించాడు గాంధీజీ ఆదర్శవంతమైన ఆచరణ, నిరాడంబరత, నిజాయితీ సత్యసంధత, శాంతిమార్గం , కార్య సాధన, అహింస వ్రతం, సర్వమత సమతా సకల మానవ సౌబ్రాతుత్వం అనే ఉత్తమ లక్షణాలతో భారత దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.
అందరికి గాంధీజీ మాట వేదవాక్కు గ మారింది జలియన్ వాలా భాగ్ దురంతాలను ఖండించి ప్రభుత్వాన్ని ఎదురించి జైలుకి వెళ్ళాడు. హారిజనోద్ధరణ మద్యపాన వ్యతిరేకోద్యమం సాగించాడు. స్వతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తో పోరాటం సాగిస్తూ సహాయనిరాకరణోద్యమమం, ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. భారతీయులకు సంపూర్ణ స్వాతంత్యం కావాలని నిర్భయంగా చాటాడు . క్విట్ ఇండియా ఉద్యమం నడిపి కారాగార శిక్ష అనుభవించాడు .
రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యేవారు చివరకు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజి అహింస ఉద్యమాలకు తలవంచి ఆగస్టు 15 -1947 న భారత దేశానికి స్వాతంత్యం ప్రకటించింది . గాంధీజీ మహమ్మదీయుల పక్షపాతి అని భావించి నాథురాం గాడ్సే అనే హిందూ మతోన్మాది తుపాకీ గుళ్లకు భలే 30-1 -1948 న కన్ను మూసాడు మహాత్మా గాంధీజీ మనముందు లేకపోయినా అయన సందేశం నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది.