మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
ప్రజా వేదిక
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గత సంవత్సరం జరిగిన పనులకు సంబంధించి ప్రజావేదికను సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.
మండల ఉపాది హామి పథకం A.P.O లక్ష్మయ్య ఉపాధి హామీ పథకం క్రింద 2018 ఆగష్టు 1 నుండి 2019 ఏప్రిల్ 31 వరకు జరిగిన పనులకు ఒక కోటి నలబై లక్షలు(1.40 కోట్లు) ఖర్చు చేసినట్లుగా తెలిపారు.
11వ విడత సామజిక తనిఖీలో భాగంగా గత సంవత్సరం జరిగిన పనులకుగాను ఈ నెల 19 నుండి 23 వరకు ఆయా గ్రామపంచాయతీలో గ్రామ సామజిక తనిఖీ అధికారులు పర్యటించి జరిగిన పనులను మరియు రికార్డ్స్, మష్టర్లను పరిశీలించి , గ్రామాలవారిగా గ్రామసభలు నిర్వహించి ప్రజల నుండి అభ్యంతరాలు మరియు సమాచారం సేకరించి నివేదికలు తయారు చేశారు. ఈ నివేదికలను గ్రామాల వారీగా సామజిక తనిఖీ అధికారులు చదివి వినిపించారు.
ఈ సమావేశానికి A.P.D గోవింద రాజులు అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ…..హరితహారం పథకంలో భాగంగా నాటిన చెట్లు మొక్కలు నూటికి 90% చనిపోయినవని, వాటి పెంపకం పట్ల నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్,ఉపాది అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అలాగే బిల్లులు బకాయిలు చెల్లించినప్పటికీ రికార్డ్స్ లో నమోదు చేయకపోవడాని తీవ్రమైన తప్పుగా పరిగణించారు. ఈ సమావేశానికి MPDO సురేష్ గారు, సామజిక తనిఖీ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు, ఉపాధి APO లక్ష్మయ్య,TAలు,ఫీల్డ్ అసిస్టెంట్స్,మండల ప్రజలు పాల్గొన్నారు.