మన ఆయుర్వేదం
ప్రస్తుత సమాజంలో కిడ్నీల సమస్యతో,కిడ్నీలలో రాళ్ల వల్ల,మూత్రంలో మంట లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు.దానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం.
దీనికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంది కానీ అవగాహన లోపంతో దాన్ని పాటించలేకపోతున్నారు.
కిడ్నీలో రాళ్లకు ముఖ్య కారణం కాల్షియం కార్బనెట్, ఇది మనం తీసుకునే ఆహారంలో ఉండడంతో మూత్రనాళంలో చేరి గడ్డకట్టి రాళ్లుగా మారతాయి.
ఇప్పుడు మనం చెప్పబోయే చెట్లను ఉపయోగించి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా,డయలసీస్ లేకుండా ఈ సమస్యను పూర్తిగా దూరం చేసుకోవచ్చు.
ఒకటి తెల్ల గలిజేరు చెట్టు మరొకటి పిండి కొమ్ముల చెట్టు.
తెల్ల గలిజేరు చెట్టు:ఈ చెట్టు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి పది నిమిషాలు మరగనివ్వాలి అనంతరం చలార్చి వడపోసి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీల శుద్ధితో పాటు మూత్రనాళ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. కానీ ఈ ప్రక్రియ 21 రోజులు చేయవలసి ఉంటుంది.ఇది తీసుకున్న తర్వాత అరగంట దాక ఎలాంటి ఆహార పానీయాలు ముట్టరాదు.
పిండి కొమ్ముల చెట్టు:ఈ చెట్టు ఆకులు శుభ్రపరిచి దంచి రసం తీసి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి, అలా కుదరని వారు కూర వండి కూడా తినవచ్చు.అలా కూడా కుదరని వారు రోజు నాలుగు ఆకులు నోట్లో వేసుకుని నమలి రసంమింగడి పిపి వెల్లగాయండి.
ఇవి కిడ్నీలకు మంచి రిలీఫ్ ఇస్తాయి. కానీ పిండి కొమ్ముల ఆకు అధికంగా తీసుకుంటే వేడి చేస్తుంది కావున స్వల్ప మోతాదులో తీసుకోండి.
ఒక్క సారి వాడి చూడండి.