మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎంపీ రాములు.
మాడ్గుల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యుదయ భారత్,వందేమాతరం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు ముఖ్య అతిథిగా పాల్గొని వసతి గృహాన్ని ప్రారంభించారు.అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ,ఎంపీపీ,సర్పంచ్,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.