మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను పంపిణి చేసిన ఎమ్మెల్యే
అచ్చంపేట పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నూతన ద్విచక్ర వాహనాలను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
ఉప్పునుంతల మండలపరిధిలోని కొరటికల్ గ్రామ మత్స్యకారులకు, ఆర్థికంగా ఎదగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ద్విచక్ర వాహనాలను గ్రామానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శోభన్ రెడ్డి,మండల నాయకులు తిప్పర్తి నరసింహ రెడ్డి,గణేష్,లక్ష్మయ్య,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.