మంచి నీటి వృధాను అరికట్టాలి
◆మంచి నీటి వృధాను అరికట్టాలి◆
పబ్లిక్ నల్లాకు సరియైన మూత లేని కారణంగా మురుగులో కలుస్తున్న మంచినీరు…
అచ్చంపేట పట్టణంలో మంచినీరు అధికంగా వృధా అవుతుంది, దానికి కారణం పబ్లిక్ నల్లలకు సరియైన మూత(ట్యాప్)లు లేకపోవడమే.అచ్చంపేటలోని 20 వార్డ్ లలో ఒక్కో వార్డ్ కి 20 నుండి 40 వరకు పబ్లిక్ నల్లాలు ఉన్నాయి కానీ అందులో సగానికి పైగా నల్లాలకు మూత(ట్యాప్)లు లేవు,అందువల్ల అధిక భాగం మంచినీరు మురుగులో కలుస్తుంది.ప్రజా అవసరాల అనంతరం నల్లాలకు సరియైన మూతలు లేకపోవడంతో అలాగే వదిలి వేస్తున్నారు పర్యవసానంగా చాలా మంచినీరు మురుగు(మోరీ)పాలు అవుతుంది. దీనిపై అచ్చంపేట మున్సిపాలిటీ వారు స్పందించి నల్లాలకు సరియైన మూత(ట్యాప్)లు బిగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ భూగ్రహంపై 71% నీరు ఉన్నప్పటికీ,త్రాగడానికి అవసరమైన మంచి నీరు మాత్రం 1% ఉంది, కావున మంచి నీటిని పరిరక్షించుకునే భాద్యత ప్రతి ఒక్కరిది.