భ్రమరాంబ ఆలయానికి ధాతల విరాళము
భ్రమరాంబ దేవాలయానికి దాదాపు 200 చదరపు గజాల స్థలాన్ని అచ్చంపేటకు చెందిన పోకల లింగమ్మ,గురు లింగం దంపతులు విరాళంగా ఇచ్చారు.బుధవారం పోకల నాగమణి, రవీందర్ దంపతులు దేవస్థాన పునర్నిర్మాణ సమితి అధ్యక్షులు పోకల మనోహర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు లకు ఒక లక్ష ఒక వెయ్యినూట పదహారు రూపాయలను విరాళంగా అందజేశారు. దాతలు రవీందర్ దంపతులకు దేవస్థానం పునర్నిర్మాణ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బంధం రాజు, నాయకులు బాలరాజు,శ్రీను, లింగం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.