బ్రహ్మకుమారి ఈశ్వరీయం వారి అధ్వర్యంలో రాఖీ వేడుకలు
పట్టణంలోని స్థానిక శిశుమందిర్ విద్యాలయం ఆవరణలో బ్రహ్మకుమారి ఈశ్వరీయం అచ్చంపేట వారి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు.బ్రహ్మకుమారి ఈశ్వరీయం వారి తరపున సిస్టర్ రేణుక,సునీత పాల్గొని ప్రసంగించారు.
మొదటగా సరస్వతి దేవి పూజ,ప్రార్థన అనంతరం ఓంకారనాదంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకలో రేణుక గారు విద్యార్ధులకు రక్షా బంధనం యొక్క విశిష్టతను,గొప్పదన్నాని చక్కగా వివరించారు.
శ్రావణమాసం అంటేనే ఒక విశిష్టత కలిగిన సమయమని, ప్రతి రోజు పండగ వాతావరణాన్ని కలిగి ఉంటుందని వివరించారు.భారతదేశం ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని ఇక్కడ పుట్టిన మనం ఎంతో అదృష్టవంతులం అని విద్యార్థులకు తెలియజేశారు.
విద్యార్థులకు సరస్వతీ మాత ఆశీర్వాదం అలాగే శక్తి స్వరూపిని భరతమాత ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె ఆకాంక్షించారు.అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం,స్థానిక ప్రజలు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
సరస్వతి దేవి ముందు జ్యోతి ప్రజ్వలన చేస్తున్న రేణుక