బ్యాక్ లాగ్ విద్యార్ధులకు మరో అవకాశం
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలలో 2000సంవత్సరం నుండి 2012 మధ్య డిగ్రీ చదివి ఇంకా బ్యాక్ లాగ్ పేపర్లు ఉన్న విద్యార్థులకు పరిక్ష రాసేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో అవకాశాన్ని కల్పించిందని ప్రగతి కళాశాల ప్రిన్సిపాల్ జగపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.2000 నుండి2012 మధ్య ప్రవేశం పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఈనెల 8వ తేది నుండి 13వ తేది వరకు ఫీజు చెల్లించాలి.