బ్యాంకు ఖాతాదారులు తస్మాత్ జాగ్రత్త
మీకు బ్యాంకులో అకౌంట్ ఉందా అయితే జాగ్రత్త, ఆర్థిక నేరగాళ్ల చూపు ఎప్పుడూ మీపైనే ఉంటుంది.
అచ్చంపేట పట్టణంలోని ఒక ఎస్బిఐ ఖాతాదారునికి ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ అని, అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డు నెంబర్,ఆధార్ నెంబర్ నెంబర్లు చెప్పవలసిందిగా కోరడంతో అతను తన వద్ద ప్రస్తుతం ఆ వివరాలు లేవని, బ్యాంకుకు వచ్చి ఇస్తానని చెప్పాడు.మధ్యాహ్నం బ్యాంకులో సంప్రదించగా తాము ఎవరికీ ఎలాంటి ఫోన్లు చేయలేదని తెలియజేశారు.6289359990 ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించగా బ్యాంకు మేనేజర్ ఆదిత్యవర్మ పేరుతో ఉన్నది.
అది ఒక ఫ్రాడ్ కాల్ అని, బ్యాంకులు కస్టమర్ కి ఫోన్ చేసి వివరాలు చెప్పమని ఎప్పటికీ అడగరని,అలా అడిగితే వివరాలు చెప్పకూడదని బ్యాంక్ సిబ్బంది తెలియజేశారు.అలా ఫోన్ చేస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలని తెలియజేశారు.
కొన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటే ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
“బ్యాంకులు తమ కస్టమర్ కు ఫోన్ చేసి అకౌంట్ వివరాలు చెప్పమని ఎప్పటికీ అడగరు”.