బాలల దినోత్సవ వేడుకలు
ఉప్పునుంతల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ జన్మదినం పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి,జ్యోతి ప్రజ్వలన చేశారు.విద్యార్థులతో ఆటపాటలు,వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాల్ జంగయ్య,ఉపాధ్యాయ బృందం శేఖర్ రెడ్డి,సత్యనారాయణ,శ్యామ్ సుందర్ గౌడ్,నాగేశ్వర్ రావు,సతీష్,పర్వతాలు,శ్రీలత పాల్గొన్నారు.