బదిలీ పై వెళ్తున్న ఉపాధ్యాయునికి సన్మానం
అమ్రాబాద్ మండలంలో గిరిజన వసతి గృహ సంక్షేమ అధికారిగా సంవత్సరం పాటు సేవలు అందించి,విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి వారి మన్ననలు పొంది,బదిలీ పై వెళ్తున్న కె.శ్రీనివాస్ కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర) అమ్రాబాద్ యందు ప్రధానోపధ్యాయుడు పి.పాండు అధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం,గిరిజన వసతి గృహా విద్యార్థులు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు దశరథ్,లింగారెడ్డి,పోమ్యా,శంకర్,అనిల్,జేత్య,కృష్ణయ్య,హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.