బడి బయటి పిల్లలను పాఠశాలలో చేర్పించిన కోనేరు సంస్థ
కోనేరు సంస్థ అధ్వర్యంలో బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించడం జరిగింది.బీకే తిర్మలాపూర్ గ్రామంలో పంటపొలాలకు వెళ్తున్న పిల్లాడిని కోనేరు సంస్థ సీసీఓ సురేష్ గౌడ్ గమనించి, ఆ బాలుడి వివరాలు సేకరించి, అతని కుటుంభ సభ్యులతో మాట్లాడి,నచ్చజెప్పి మన్ననూర్ లోని పిటిజి పాఠశాలలో ప్రధానోపధ్యాయునితో మాట్లాడి పాఠశాలలో ప్రవేశం కల్పించారు. అదేవిదంగా ప్రధానోపధ్యాయుని సూచన మేరకు వసతిగృహంలో చేర్పించారు.ఈ సందర్బంగా సురేష్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి పిల్లాడు చదువుకోవడమే తమ సంస్థ లక్ష్యమని తెలియజేసాడు.