ప్లాస్టిక్ రహిత అచ్చంపేట
ప్లాస్టిక్ రహిత అచ్చంపేట సాధనలో భాగంగా అచ్చంపేట మున్సిపాలిటీ వారు పట్టణంలోని ప్రతి వ్యాపార సముదాయాలలోని ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. సేకరించిన వాటిని మున్సిపాలిటీ వారు కాల్చి వేయనున్నట్లు వారు తెలిపారు. ఇక పై ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే భారీ జరిమానాలతో పాటు చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.