ప్లాస్టిక్ కవర్లపై అక్టోబర్ 2 నుంచి నిషేధం
ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు,కప్పులు,ప్లేట్లు, స్ట్రాలు,ప్యాకెట్లు తదితర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి నిషేధం విదించనుంది.ఇలాంటి ఉత్పత్తుల తయారీ,దిగుమతి,వినియోగం పై కఠినంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ పట్టుదలతో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.