ప్రముఖ కవయిత్రి డా.పోల సాయిజ్యోతి గారికి ప్రతిష్టాత్మకమైన అవార్డు
బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ప్రసిద్ధ కవయిత్రి డా. పోల సాయిజ్యోతి గారికి 2019కి గాను మనం-మన ఊరి బడి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి డాక్టర్ పోల సాయిజ్యోతి అవార్డు కి ఎంపికయ్యారు. సాయి జ్యోతి ఎంపిక పట్ల పలువురు కవులు,రచయితలు హర్షం వ్యక్తం చేశారు.
మనం-మన ఊరి బడి 2019 అవార్డును ఆదివారం నెల్లూరు జిల్లాలోని గూడూరులో ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానం చేశారు.