ప్రభుత్వ పాఠశాలల పై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రయివేటుకు ధీటుగా విద్య భోధన అందిస్తామని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల లో ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహనా కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాలల్లో ఉపాధ్యాయులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు ఫ్లెక్సీలు, కరపత్రాలు ముద్రించి పంచిపెడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పించే వసతులు బోధనకు సంబంధించిన వివరాలు తల్లిదండ్రులకు తెలియచేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయివేటుకు ఏమాత్రం తగ్గకుండా ఇంగ్లీష్ భోధిస్తున్నామని తెలియ చేసారు.
అన్ని అర్హతలు సాధించి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సంపాదించామని మీ పిల్లల ఉజ్వల భవిశ్యత్తుకు హామీ ఇస్తున్నామని గ్రామస్తుల సహాయం తో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.