ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పై సమావేశం
అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి గ్రామంలో కోనేరు సంస్థ ఆధ్వర్యంలో సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వారి సహకారంతో యువతతో సమావేశం నిర్వహించి,గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పై చర్చించడం జరిగింది.కోనేరు సంస్థ మండల సమన్వయ కర్త ఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ…
గ్రామం నుండి ఏ ఒక్క విద్యార్థి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపించే విధంగా ప్రేరణ కల్పించి,గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే బాధ్యత యువకులపై ఉందని గుర్తు చేశారు.అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు పై పర్యవేక్షిస్తూ,తల్లిదండ్రులు గాని యువకులు గాని విద్యార్థుల ప్రగతి తెలుసుకోవాలని చెప్పారు.అదే విధంగా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలకు కమిటీ సభ్యులు హాజరై విద్యార్థుల చదువుల పై చర్చించాలని చెప్పడం జరిగింది.ఈ సమావేశంలో కోనేరు సంస్థ సీసీఓ సురేష్ గౌడ్,యువకులు పాల్గొన్నారు.