ప్రభుత్వ దవఖానల్లో ఉచితంగా రోటావైరస్ టీకా
శిశు మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ దవఖానల్లో 6నెలలలోపు శిశువులకు వచ్చేనెల(సెప్టెంబర్) నుంచి ఉచితంగా రోటావైరస్ టీకాను ఉచితంగా వేయనున్నారు.
రోటా వైరస్ వాక్సినేషన్ కోసం అన్నీ ప్రభుత్వ దవాఖానల సిబ్బందికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు నిలోఫర్ దవాఖాన ఇన్చార్జి డాక్టర్ రమేష్ దాంపురి తెలిపారు.నవజాత శిశువు దగ్గర నుండి 5ఏళ్ల లోపు పిల్లలకు రోటా వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.ఈ వైరస్ సోకి చిన్నారులు డయేరియా కు గురై మృత్యువాతపడే ప్రమాదం ఉందని చెప్పారు.
ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రమే లభించే ఈ వాక్సినేషన్ ఇకమీదట ప్రభుత్వ ఆసుపత్రిలో లభిస్తుందని వారు తెలియజేశారు. ఈ వ్యాక్సినేషన్ ను కేవలం ఆరు నెలల లోపు పిల్లలకు మాత్రమే ఇవ్వాల్సి ఉందని తెలియజేశారు.
శిశువు పుట్టిన నెలన్నరకు, రెండునెలలన్నరకు, మూడు నెలలన్నరకు మూడు దఫాలుగా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.