ప్రభుత్వ ఆసుపత్రి పై పెరిగిన ప్రజల నమ్మకం
గతంలో ప్రభుత్వాసుపత్రి అంటే కేవలం పేద ప్రజలకు మాత్రమే వైద్య సేవలు అందించే ఆసుపత్రి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పేదవాడి తో పాటు మధ్యతరగతి అలాగే ఎగువ తరగతివారు కూడా ఆసుపత్రి ముందు బారులు తీరుతున్నారు.వర్షాకాలం ప్రారంభం అవడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి, దీనితో మండలంలోని నలుమూలల నుంచి ప్రజలు ప్రభుత్వాసుపత్రి వద్ద క్యూ కడుతున్నారు.
అచ్చంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తొమ్మిది మంది డాక్టర్ల బృందం, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్,28 మంది నర్సులతో పాటు సిబ్బంది ఉండటం,అన్నీ పరీక్షలు నిర్వహిస్తుండడం,అన్నీ రకాల వ్యాధులకు మెడిసిన్స్,ఇంజక్షన్స్ ఆసుపత్రిలోనే లభిస్తుండడంతో ప్రభుత్వాసుపత్రి పై ప్రజల నమ్మకం బాగా పెరిగిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గర్భిణీ స్త్రీల ప్రసవాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించాలనే నిబందన ఉండడంతో నూటికి 99 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి.ప్రతి నెలా 92 నుండి100 దాకా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు, ప్రతి మంగళ వారం స్కానింగ్, సోమ, బుధ, శుక్రవారాల్లో డెలివరీ కేసులు నిర్వహిస్తున్నారు.