ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను సింధు గెలుచుకుంది
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను సింధు గెలుచుకుంది. ఆదివారం మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి నవోమి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘన విజయం సాధించింది. ఒకుహరను వరుస సెట్లలో ఓడించి జయకేతనం ఎగురవేసింది.