ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం మార్చ్ 24

అచ్చంపేట : క్షయవ్యాధి దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ వైద్య ఆసుపత్రి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి క్షయ వ్యాధి నివారణ గురించి ప్రజలకు తెలియచేసారు. క్షయవ్యాధితో బాధపడుతున్న వారికీ సరైన మార్గం చూపించాలని మరియు చికిత్స యెక్క లాభాలను అందరికి తెలియచేసారు, క్షయవ్యాధి మందులు పూర్తికాలం వాడాలని అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని అందరికి తెలియచేసారు.
ఈ వ్యాధికి సంభంధించిన అన్ని పరీక్షలు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికి తెలియచేసారు.
టి . బి నిర్ధారణ జరిగితే చికిత్స పూర్తయ్యేవరకు ప్రతినెలా 500 /- పోషణ భత్యం లభిస్తుందని అందరికి తెలియచేసారు.