ప్రజావాణికి కరువైన ఆదరణ
ప్రజావాణికి కరువైన ఆదరణ:
మండల స్థాయిలో ప్రజావాణికి దరఖాస్తు చేసుకునేవారు కరువయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడంతో మండల ప్రజలు నేరుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణికి దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనిపై డిప్యూటీ తహసిల్దార్ పట్టాభి స్పందిస్తూ…..జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడంతో అక్కడే దరఖాస్తు చేసుకుంటున్నారని,కలెక్టర్ కార్యాలయం నుండి దరఖాస్తులు మాకు చేరగానే సమాచారం సేకరించి, దానిపై చర్యలు చేపడతామని,అలాగే సమాచారాన్ని కూడా కలెక్టర్ కార్యాలయంకు పంపిస్తామని తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించాలని, వారు కోరిన సమాచారం ఇవ్వడానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజావాణిని కొనసాగిస్తున్నందున ఈ అవకాశంను అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.