పోలీస్ శాఖ అధ్వర్యంలో రక్త దానం
పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేట పోలీస్ స్టేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ అచ్చంపేట మరియు పోలీస్ శాఖల అధ్వర్యంలో రక్త దాన కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు సంస్మరణ సభ నిర్వహించి నివాళులు అర్పించారు.
అనంతరం రక్త దానానికి తరలివచ్చిన యువకుల నుండి రక్తాన్ని యూనిట్లుగా సేకరించి వారికి ప్రసంశా పత్రాన్ని అందజేశారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం నేటి మధ్యాహ్నానికి దాదాపు 80 యూనిట్లు సేకరించినట్లు తెలిపారు.సాయంత్రం వరకు సేకరించిన యూనిట్లను బ్లడ్ బ్యాంకుకు తరలించనున్నారు.