పోలీసులకు గుడ్ న్యూస్
తెలంగాణ సర్కార్ నగర పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సందర్భంగా సిటి కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ… నగరంలో విధులు నిర్వహిస్తున్న ఖాకీలకు వారంతాపు సెలవు దినం విధానాన్ని దశల వారీగా అమలు చేస్తామని శనివారం ప్రకటన విడుదల చేశారు. తొలి దశలో వెస్ట్‌జోన్‌లోని 1367 మంది పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్ లు వర్తిస్తాయని ఆయన చెప్పారు. తర్వాత హైదరాబాద్ లోని పోలీసులందరికీ ఈ వీక్లీ ఆఫ్ లు అమలు చేస్తామని కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.