పోచమ్మ తల్లి బోనాలు

అచ్చంపేట గ్రామ దేవత పోచమ్మ తల్లి బోనాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.సాయంత్రం 5గంటలకు బోనాలు బోడ్రాయి వద్ద పూజలు చేసి బయలుదేరి ప్రధాన రహదారి గుండా సాయంత్రం 7గంటలకు ఆలయానికి చేరుకున్నాయి.
అనంతరం మహిళలు అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఉదయం నుండే గ్రామస్తులు పోచమ్మ ఆలయం వద్ద బారులు తీరారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
Thanks for regular updates