పెద్దపులి దాడిలో ఆవు మృతి
అమ్రాబాద్ మండలంలో పెద్దపులి దాడి చేయడంతో ఒక ఆవు మృతిచెందింది. వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన జహంగీర్ గురువారం తన పశువులను మేపడానికి గ్రామ శివారులోని అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుండగా అటవీ సరిహద్దులో మాటు వేసిన పెద్దపులి ఒకసారిగా మంద పై దాడి చేసి ఆవును చంపివేసింది.ఆవు మృతదేహం వద్దే పులి కూర్చోని వుండడంతో అటుగా వెళ్ళే సాహసం గ్రామస్తులు కానీ , అటవీ అధికారులు కానీ చేయలేకపోయారు.
అడవిలోకి వెళ్ళే దారిలోనే ఈ సంఘటన జరగడంతో పశువులు మేపడానికి అడవికి వెళ్లిన కాపరులు మరియు పశువులు ఊరిలోకి వచ్చే మరోదారి తెలియక ఆందోళన చెందారు.అనంతరం మరో మార్గం గుండా గ్రామం చేరారు.
రేపు ఫారెస్ట్ అధికారులు పంచనామా నిర్వహించి పై అధికారులకు రిపోర్ట్ పంపనున్నారు.