పాస్ బుక్ కోసం రైతు ఆవేదన
బల్మూరు మండలం పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన పెద్ది రమేష్ తన పేర గ్రామ శివారులో ఉన్న 16 ఎకరాల 37 గుంటల భూమికి సంభందించిన కొత్త పాస్ బుక్కులు ఇప్పించాలని మండల అధికారులకు మొరపెట్టుకున్నాడు.
వారసత్వ భూమి కావడంతో పాత పాస్ బుక్కులు, ఆర్ఓఆర్ ,పహాని తన వద్ద ఉన్నాయని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన భూప్రక్షాళనలో భాగంగా తనకు కొత్త పాస్ బుక్కులు అందలేదని,మండల తాసిల్దార్ కి, ఆర్డివొకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కొత్త పాస్ బుక్కులు, రైతుబంధు పథకం అందేలా చూడాలని కోరాడు.