పార్ట్ టైమ్ స్వీపర్లను మరియు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
◆పార్ట్ టైమ్ స్వీపర్లను మరియు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి◆
తెలంగాణ వచ్చిన వెంటనే పార్ట్ టైమ్ స్వీపర్లను మరియు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం అన్నారు.
గత 5 ఏండ్ల కిందట పంచాయతి రాజ్ మంత్రి కె.టి.ఆర్ గారు నాగర్ కర్నూల్ వచ్చినపుడూ హామీ ఇచ్చారు.
అలాగే తరువాత మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా పార్ట్ టైమ్ స్వీపర్లను రెగ్యులరైజ్ చేస్తాం వేతనాలు పెంచుతం అన్నారు.1993 నాటికీ 25-1 వున్న వారిని అందరిని రెగ్యులర్ చేస్తాం అని ప్రభుత్వ అధికారి రామకృష్ణ రావు గారు చెప్పారు.
నెల రోజుల కిందట ఆంధ్ర జ్యోతి పేపర్లో ఇచ్చినరు ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అయ్యా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని అంటున్నారు.ఈ సమావేశంలో తెలంగాణ పంచాయతి రాజ్ పార్ట్ టైమ్ స్వీపర్ల సంఘము అధ్యక్షులు చెన్న కేశవులు,సభ్యులు శ్రీను, బాలయ్య,ఎల్లయ్య,బిచ్ఛమ్మ,రాము, ఉస్సెన్ పాల్గొన్నారు.