పారిశుధ్యం ప్రతి ఒక్కరి భాద్యత,అందరు భాగస్వాములే
పారిశుధ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు.మున్సిపాలిటీ నుండి రద్దు కాబడిన విలీన గ్రామాలలో ఆయన పర్యటించి పారిశుధ్య నిర్మూళన పనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా లింగోటం,నడింపల్లి,పులిజాల,లక్ష్మాపూర్ గ్రామాలలో 30 రోజుల ప్రణాళికాలో భాగంగా పల్లెప్రగతి పనులు ప్రారంభించారు.ఆయా గ్రామాలలో ప్రత్యేక అధికారులు,ప్రజలు సమన్వయంతో సంక్షేమం,అభివృద్ధె ధ్యేయంగా ముందుకు వెళ్ళాలన్ని సూచించారు.విలీన గ్రామాలను రద్దు చేయించినందుకు ఎమ్మెల్యే బాలరాజుకు లక్ష్మాపూర్లో సన్మానించారు.