పసిడి పరుగులు

పరుగు పందెంలో పుత్తడి వేగం జోరుగా కొనసాగుతుంది.
ప్రస్తుత మార్కెట్ లో తులం రూ.39,670 కి చేరింది. సోమవారం ఒకరోజే రూ.675 పెరిగింది.వచ్చే మరికొన్ని నెలలో బంగారం 41వేలు దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.దేశ ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉండడంతో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్లను అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో పాటు అమెరికా చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కొనసాగుతుండడంతో బంగారం ధరలు భగ్గుమనడానికి కారణాలు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బంగారం సామాన్యుడికి మరింత దూరం అవుతున్నది పదేళ్ల క్రితం రూ.14,500 తులంగా ఉన్న బంగారం ప్రస్తుతం మూడు రెట్లు పెరిగి 40వేల మార్కును చేరింది.