పశు గ్రాసం కరువు.. పశు పోషణ బరువు
అచ్చంపేట : పశుగ్రాసం కొరతతో మూగజీవాలు గోస తీస్తున్నాయి గ్రాసం కొరతతో చాలామంది రైతులు పశువులను, గేదెలను కబేళాలకు తరలిస్తున్నారు. కొంతమంది రైతులు గడ్డినికొనుగోలు చేసి పశువులను బతికించుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. వర్షాభావ ప్రభావంతో చెరువులు కుంటలు బోర్లు ఇంకిపోవడం తో పటు, నాలుగేళ్లనుండు వరుస కరువు కనీసం రబీ లో వరిసాగుచేద్దామన్న బోర్లల్లో నీరు అడుగంటి పోవడం తో పశువులను బతికించలేక పోతున్నారు.