పల్లెల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి

అచ్చంపేట : పల్లెలు అభివృద్ధి సాధించినప్పుడే పట్టణాలు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని MLA గువ్వల బాలరాజుస్పష్టం చేసారు. రాష్ట్ర ముఖ్యమంతి కెసిఆర్ ప్రగతిభవన్ లో నిర్వహించిన సమావేశంలో MLA గువ్వల బాలరాజు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామాలూ అభివృద్ధిచెందాలని తెరాస ప్రభుత్వం నూతన పంచాయితీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. గ్రామాలలో ఎన్నికైన కొత్త సర్పంచులు కొత్త పంచాయితీరాజ్ చట్టం నిబంధనల మేరకు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామాలలో త్రాగునీరు, డ్రైనేజిలు, వీధిదీపాలు, మెదలైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు.