పంటల పై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు
లింగాల మండలంలోని మాడాపూర్ గ్రామంలో రైతులకు లింగాల వ్యవసాయ శాఖ వారు రబీ పంటలైన వరి, వేరుశెనగ పంటల పై అవగాహన కల్పించారు. అదేవిదంగా రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేపించుకోవాలని సూచించారు.గత ఖరీఫ్ కాలంలో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద రైతులు ఇంతకుముందు తీసిన మట్టి నమూనాలకు సంబందించిన మృతిక ఆరోగ్య పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎవో నాగార్జున రెడ్డి,వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.