పంచాయితీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో
అమ్రాబాద్ మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం ఎంపీడీవో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా 30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలలో జరిగిన పనులపై, గ్రామాలలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, నర్సరీల ఏర్పాటు మొదలగు అంశాలపై చర్చించారు.
అదేవిధంగా గ్రామాలలో ఇంకా చేపట్టవలసిన పనుల పై, మరియు గ్రామాలకు అవసరమైన ట్రాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది నియామకం మొదలగు అంశాలపై పంచాయతీ కార్యదర్శిలతో చర్చించారు.
ఈ సమీక్షకు అమ్రాబాద్ ఎంపీడీవో, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.