నేటి బందును విజయవంతం చేయండి
యురేనియం తవ్వకాలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేటి నల్లమల బందును విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ కోరారు.
మానవ, జీవరాశుల మనుగడకు హాని తలపెట్టే యురేనియం తవ్వకాలను రద్దు చేయాలనే డిమాండ్ తో తలపెట్టిన బంద్ కు రాజకీయ, కుల సంఘాల, విద్యార్థి సంఘాల,ప్రజా, మేధావివర్గం సహకరించాలని కోరారు.
ఈ బంద్ కు వి హెచ్ పి,టి పీ ఎఫ్,గిరిజన సంఘం, చెంచు సేవా సంఘాలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి.