నెట్వర్క్ లేని కారణంగా ఆంధ్రా బ్యాంకు సేవలు నిలిపివేత
గత శుక్రవారం నుండి ఇప్పటి వరకు ఆంధ్రా బ్యాంకు సేవలు నిలిచిపోయాయి, కారణం BSNL నెట్వర్క్.
గత ఐదు రోజులుగా BSNL నెట్వర్క్ పనిచేయడం లేదు,అందువల్ల పట్టణంలోని BSNL మొబైల్స్ మూగబోయా యి, ఈ నెట్వర్క్ వాడుతున్న బ్యాంకు, ఇంటర్నెట్ లాంటి సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నెట్వర్క్ రాగానే సేవలు తిరిగి ప్రారంభిస్తామని,కానీ ఎప్పుడు నెట్వర్క్ వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమని బ్యాంకు సిబ్బంది తెలియజేశారు.ఆర్ధిక లావాదేవీలు నిలిచిపోవడంతో ఎటూ అర్థం కావడం లేదని,సాధ్యమైనంత త్వరగా నెట్వర్క్ బాగుచేసి సేవలు అందించాలని బ్యాంకు అధికారులను ప్రజలు కోరుతున్నారు.