నూతన ఎమ్మార్వో ను సన్మానించిన ప్రజాప్రతినిధులు
అచ్చంపేట మండలానికి నూతనంగా నియమించబడిన ఎమ్మార్వో చంద్రశేఖర్ ను తహసిల్దార్ కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఇంతకుముందు ఎమ్మార్వోగా పనిచేసిన చెన్నకిష్టయ్య వేరే ప్రాంతానికి బదిలీ కాగా ఆయన స్థానంలో చంద్రశేఖర్ గారు నియమించబడ్డారు.
ఈ సందర్బంగా మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా రైతు సమన్వయ కమిటీ ఛైర్మన్ పోకల మనోహర్,మునిసిపల్ ఛైర్మన్ తులసి రామ్,జడ్పీటీసీ మంత్ర్య,తెరాస నేతలు నరసింహ గౌడ్,రామకృష్ణ రెడ్డి,అచ్చంపేట కౌన్సిలర్లు,ఇతర నాయకులు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి,సన్మానించారు.