నూతన అంబేద్కర్ గ్రామ కమిటీ ఎన్నిక
ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో నూతన అంబేద్కర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ నూతన అధ్యక్షులుగా ఉప్పరి బాలరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు బాలరాజ్ మాట్లాడుతూ…అంబేద్కర్ ఆశయాల సాధనకు గ్రామంలో అంబేద్కరిజాన్ని పాటిస్తూ, పార్టీలకతీతంగా దళితులు ఏకమై, సంఘటితమై మహనీయుడు అంబేద్కర్ ఆలోచనా విధానాలను ముందుకు తీసుకుపోవాలని అన్నారు.అనంతరం గ్రామ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.