నువ్వా.. మా క్రికెట్ జట్టును హేళన చేసేది?
న్యూజిలాండ్‌తో నాల్గో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయ్యింది. భారత్ 92 పరుగులకు ఆలౌట్ కావడాన్ని ఉదహరిస్తూ.. ఈ రోజుల్లో వంద పరుగుల లోపు ఆలౌటయ్యే జట్టు ఉందంటే అది నమ్మశక్యంగా లేదంటూ వాన్ ట్వీట్ చేశాడు. దీనిపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.