నీటి వనరుల సర్వే.
నీటి వనరుల సర్వే
భూగర్భ జలాలను అంచనా వేసేందుకు త్వరలో సర్వే చేపడుతున్నామని ఆర్డీవో పాండు తెలియజేశారు.స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి పర్యవేక్షకులు,గణన సిబ్బంది తో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.నీటి లభ్యత, భూగర్భ జలాలను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సర్వేలో భాగంగా సాగునీటి కాలువలతో పాటు చెరువులు,కుంటలు, జలాశయాలను అంచనా వేస్తామని తద్వారా నీటి వనరులను వాటి లభ్యతను అంచనా వేసేందుకు ఉపయోగ పడుతుందన్నారు. ఈ గణనను 5 సంవత్సరాలకు ఒకసారి గణిస్తునందున తగు జాగ్రతలు తీసుకుని పకడ్బందీగా సర్వే నిర్వహిస్తామని తెలియచేసారు.