నిర్లక్ష్యానికి జరిమానా

లింగాల మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో హరితహారంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.అదే గ్రామానికి చెందిన రైతు తన ఎద్దును నిర్లక్ష్యంగా వదిలి పెట్టడంతో అది హరిత హారంలో నాటిన మొక్కలను తినివేసింది.దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి మండల అభివృద్ధి అధికారి సంప్రదించగా నిర్లక్ష్యం వహించిన ఎద్దు యజమానికి జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.