నిర్మలా సీతారామన్ ‘మిలీనియల్స్ ’ కామెంట్స్‌పై పేలుతున్న సెటైర్లు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో మొబైల్ రంగం మందగమనంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆధునిక యువతి కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని.. ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని సీతారామన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అంతేగాక, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లకే మొగ్గుచూపుతుండటం వల్లే ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవిగా, మరికొన్ని నవ్వు పుట్టించేవిగా ఉన్నాయి.