నిరుపయోగంగా మాంసం మార్కెట్
గతంలో అచ్చంపేటలో మాంసం మార్కెట్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం మాత్రం చెత్త చెదారంతో, మున్సిపాలిటీ సామగ్రితో నిరుపయోగంగా మారిపోయింది.
గతంలో గ్రామపంచాయతిగా వున్నపుడు గ్రామపంచాయతికి ఈ ప్రాంతం ఒక ఆదాయ వనరులు వుండేది, కానీ ప్రస్తుతం మాంసం మార్కెట్ కూరగాయల మార్కెట్ చుట్టూ రోడ్లపై కేంద్రీకృతమైనది.
అచ్చంపేట పట్టణం గ్రామ పంచాయితీ నుండి నగరపంచాయితీగా, ప్రస్తుతం మున్సిపాలిటీగా కొనసాగుతున్న మార్కెట్ వ్యవస్థ మాత్రం ఆశించిన స్థాయిలో మార్పులు జరగడం లేదు తద్వారా మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.ఇకనైనా అధికారులు మార్కెటింగ్ వ్యవస్థ పై దృష్టి కేంద్రికరించి మున్సిపాలిటీ హోదాకు తగినవిదంగా మార్కెటింగ్ వ్యవస్థను పున్వర్ వ్యవస్థికరిస్తే నగరానికి హోదా తో పాటు మున్సిపాలిటీకి టాక్స్ రూపంలో మంచి ఆదాయం కూడా వస్తుంది.
అలాగే నిరుపయోగంగా ఉన్న మున్సిపాలిటీ వస్తూసామాగ్రిని ప్రజా అవసరాలకు అనుగుణంగా వాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.