నిరుద్యోగ యువతి యువకులకు స్టేట్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్ ఉచిత శిక్షణ.
తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ,నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర యస్.సి స్టడీ సర్కిల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాఖ, వెంకటేశ్వర కాలని,హైదరాబాద్ రోడ్,మహబూబ్ నగర్.
ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు స్టేట్ సర్వీసెస్,బ్యాంకింగ్ సర్వీసెస్,RRB, SSC ఉచిత రెసీడెన్శియల్కు 100 నిరుద్యోగులకు ఉచిత భోజన నివాస సదుపాయాలతో 5.1/2 నెలల కాల పరిమితితో ఉచిత శిక్షణా కొరకై దరఖాస్తులు ఆహ్వానిస్తూన్నాం.
ఈ అవకాశంను ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన SC, ST, BC, మైనారిటీ యువతి యువకులు ప్రభుత్వం కల్పించే ఈ సదావకాశంను సద్వినియోగం చేసుకోవాలని మనవి.
విద్యార్హత: ఏదేని బ్యాచులర్ డిగ్రీ.
రిజర్వేషన్: SC-75%,ST-10%,BC-15% మరియు మొత్తంలో 33.33%మహిళలకు,5%వికలాంగులకు రిజర్వు.
ఆదాయం: 3 లక్షల లోపు
ఆన్లైన్ చివరి తేది: 20 జూన్ 2019
ఈ శిక్షణా కాలంలో ఉచిత భోజన నివాసం,ఉచిత స్టడీ మెటీరియల్ మరియు పర్సనల్ అలవెన్సు .
పరీక్షా విధానం: 100 మార్క్స్(65 మార్క్స్- జనరల్ స్టడీస్,35 మార్క్స్- జనరల్ ఎబిలిటీ).
శిక్షణా కాలం: 15/07/2019 నుండి 31/12/2019 వరకు.
ప్రవేశ పరీక్ష తేది: 30/06/2019 ఆదివారం ఉ.11గం. నుండి మ.1గం. వరకు, ప్రభుత్వ NTR మహిళా డిగ్రీ కళాశాల,మహబూబ్ నగర్.
Website: www.tsscstudycircle. telangana. gov. in
ఇతర వివరాలకు సంప్రదించండి 9885929862,8688861532,హెడ్ ఆఫీస్ ల్యాండ్ లైన్ -040-23546552.