నిత్య అన్నదానానికి దాతల విరాళం
శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం లో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు.అందులో భాగంగా శనివారం ఉమామహేశ్వరి దర్శనానికి వచ్చిన దేవరకొండ భక్తులు చేపూరి సునీత జగన్ ఆచారి దంపతులు, వారి కుమారులు ప్రశాంత్, శ్రీకాంత్,శ్రావణ్ కుమార్ లు దర్శనానంతరం ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్ గారిని కలిసి నిత్య అన్నదానానికి తమ వంతు సహాకారంగా ఇరవై వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,దాతలు అందజేస్తున్న సహాయ, సహకారాలతో ఆలయ అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో తాము భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉందని దాతలు తెలిపారు.