నల్ల మల పీఠం ఎవరిది ?
అచ్చంపేట : ప్రాదేశిక ఓట్ల లెక్కింపు గడువు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల గుండెల్లో గుబులు పుడుతుంది. ఓట్ల లెక్కింపు మరో ఐదు రోజులు ఉండేసరికి ఫలితాల పై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 14 న జరిగిన జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఫలితాల పై నేతలు గెలుపు తమదంటే తమదని గంభీర్యం ప్రదర్శిస్తున్నారు.
అచ్చంపేట మండలం లో 8 ఎంపిటిసి స్థానాలు ఉండగా ఇందులొ మెజారిటీ స్థానాలు దక్కుతాయని అధికార TRS మరియు కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి మరో పక్క బిజెపి కూడా విజయం పై గట్టి నమ్మకంతో ఉంది.