నల్లమల రాజకీయ జెఏసి సమావేశం
అమ్రాబాద్ మండల కేంద్రంలో గురువారం నల్లమల రాజకీయ జెఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా,వాటి అనుమతుల రద్దు కోసం ఈ ప్రాంత ప్రజల సహకారంతో మరియు అనేక ప్రాంతాల నుండి ప్రకృతి ప్రేమికులు,సినీ ప్రముఖులు,మేధావులు,కవులు,కళాకారులు, విద్యార్థులు ప్రతి ఒకరు ఏకమై నల్లమల ప్రాంతంలో యురేనియం అనుమతుల పై అసెంబ్లీలో తీర్మానం చేయించామని, కానీ కేంద్రం నుండి ఏలాంటి ప్రతిస్పందన రాలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీర్మానం వచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ, అలాగే ఈ ప్రాంతంలో సాగు నీటి సాధన కై కూడా పోరాటం చేయాల్సిన అవసరం మన ముందు ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు నాసరయ్య,బాల కిష్టయ్య,మోహన్,మురళి,గోపాల్,రామకోటి,వెంకటయ్య,మున్వర్ అలీ,పాండు,మల్లయ్య,పవన్ పాల్గొన్నారు.